గత లోక్‌సభ సమావేశాల్లో ఆమోదం పొందని 10 ఆర్డినెన్స్‌లను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో నేడు ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపిన ఈ బిల్లులను లోక్‌సభలో పార్లమెంట్ వ్యవహారాల సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ , రాజ్యసభలో వి. మురళీధరన్ ప్రవేశపెట్టారు.
వివాదాస్పద ముమ్మారు తలాక్‌తో పాటు భారత వైద్య మండలి, కంపెనీ, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్, ఆధార్, ప్రత్యేక ఆర్థిక జోన్ సవరణ బిల్లులతో పాటు కేంద్ర విద్యాలయాల్లో అధ్యాపకుల రిజర్వేషన్, డిపాజిట్ క్రమబద్దీకరణ ఆర్డినెన్స్‌లను ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
ఈ ఆర్డినెన్స్‌లు 45 రోజుల్లో చట్టసభల ఆమోదం పొందకపోతే వీటి కాలపరిమితి ముగుస్తుంది.
ఇదీ చూడండి : మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌కు జీవితఖైదు