మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. కంగనా రనౌత్, కరోనా అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ ఉద్ధవ్ ఠాక్రే ఈ మేరకు స్పందించారు. ఎలాంటి రాజకీయ తుపాన్లు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మౌనంగా ఉన్నంత మాత్రాన తన వద్ద సమాధానాలు లేవని అర్థంకాదని పేర్కొన్నారు. సరైన సమయంలో సీఎం ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ మాట్లాడతానని ఉద్ధవ్ హెచ్చరించారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు 10 లక్షలకుపైగా నమోదుకావడంపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ఈ నెల 15 నుంచి నా కుటుంబం-నా బాధ్యత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని.. అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి:- సీఎం ఇంటికి 'దావూద్' ఫోన్‌తో కలకలం