దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి.. డబ్బులు లేక తమ స్వస్థలాలకు వెళ్లలేక పోతున్నవారికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్. అవసరమైన వారికి రైలు టికెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కమిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.
ఇది కార్మికులకు గౌరవంతో చేస్తున్న సహకారమని ఆమె అన్నారు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారని.. వారి త్యాగాలే జాతికి పునాదులని సోనియా కొనియాడారు.
ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు పంపిస్తోంది కేంద్రం. అయితే ఈ రవాణాకు కార్మికుల నుంచి టికెట్ వసూలు చేస్తోంది. ఇలాంటి సమయాల్లో డబ్బులు లేక ఇబ్బంది పడేవారికి చేయుతనిచ్చేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:'90శాతం నిండితేనే శ్రామిక్ రైళ్లు నడపాలి'