ETV Bharat / bharat

'మహా' పదవుల పంపకాలపై కాంగ్రెస్​లో అసంతృప్తి! - మహారాష్ట్ర

మహారాష్ట్రలో అనూహ్య పరిణామాల మధ్య అధికారం చేపట్టింది శివసేన-కాంగ్రెస్​-ఎన్​సీపీ 'మహా అఘాడీ' కూటమి. మంత్రివర్గ​ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. వచ్చే వారం ఈ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో శాఖల కేటాయింపుపై కాంగ్రెస్​ రాష్ట్ర విభాగం నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని శాఖలు తమకు కేటాయిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.

`Congress unhappy about portfolio allocation in Maharashtra'
'మహా' పదవుల పంపకాలపై కాంగ్రెస్​ శ్రేణుల్లో అసంతృప్తి!
author img

By

Published : Dec 27, 2019, 5:09 AM IST

Updated : Dec 27, 2019, 6:48 AM IST

'మహా' పదవుల పంపకాలపై కాంగ్రెస్​లో అసంతృప్తి!

మహారాష్ట్రలో మంత్రివర్గ​ విస్తరణ వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో పదవుల పంపకాలపై పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు కేటాయించే శాఖలపై కాంగ్రెస్​ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని శాఖలు ఇచ్చే అవకాశం ఉందని.. ఈ సమస్యపై కాంగ్రెస్​ హైకమాండ్​కు రాష్ట్ర నాయకులు తమ ఆందోళనలు వివరించినట్లు తెలిపాయి.

డిసెంబర్​ 30 విస్తరణ!

అనూహ్య పరిణామాల మధ్య అధికారం చేపట్టిన కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీలు.. కేబినెట్​ విస్తరణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈనెల 30న మంత్రివర్గ​ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు మంత్రిత్వ శాఖలను ఒక్కోపార్టీకి రెండు చొప్పున కేటాయించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. అందులో కాంగ్రెస్​కు రెవెన్యూ, పీడబ్ల్యూడీ శాఖలు ఉన్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్​కు మరో రెండు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అందులో పశు సంవర్ధక, జౌళి శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాఖలపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని వాటిని కేటాయించటం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

" రానున్న మంత్రివర్గ​ విస్తరణలో కాంగ్రెస్​కు కేటాయించే శాఖలు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవి కాదు. కాంగ్రెస్​కు ఇచ్చిన పశుసంవర్ధక శాఖ, జౌళి శాఖలను వ్యవసాయ, పరిశ్రమల శాఖల్లో విలీనం చేయాలి. కాంగ్రెస్​ వ్యవస్థాపక దినోత్సవమైన డిసెంబర్​ 28న ముంబయికి రానున్న పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్​ ఖర్గేతో ఈ విషయంపై చర్చిస్తాం. సరైన ఒప్పందం కుదరకపోతే మాహారాష్ట్రలో కాంగ్రెస్​ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాంగ్రెస్​ పార్టీ.. వ్యవసాయం, సహకార శాఖ, పరిశ్రమలు, గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖల కోసం చూస్తోంది. కనీసం అందులో రెండింటినైనా కేటాయించాలని కోరుకుంటోంది."
- కాంగ్రెస్​ నేత.

హోంశాఖ, ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల సహాయ మంత్రులను మూడు పార్టీలు సమానంగా పొందేందుకు సిద్ధంగా ఉండాలన్నారు కాంగ్రెస్​ నేత. అలా జరిగినప్పుడే అధికార సమతుల్యత సాధించినట్లు అవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: రావత్​ 'నాయకత్వ' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Last Updated : Dec 27, 2019, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.