ETV Bharat / bharat

బంగాల్​లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రచారం - కాంగ్రెస్-వామపక్షాలు

బంగాల్​ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది.

WB Polls_Congress
బంగాల్ పోల్స్: వామపక్షాలతో కలిసి ప్రచారం చేయనున్న కాంగ్రెస్
author img

By

Published : Nov 18, 2020, 7:20 PM IST

బంగాల్​ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు నవంబర్​ 23 నుంచి ప్రతి జిల్లాలో వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్​ పేర్కొంది.

కాంగ్రెస్​-వామపక్షాల కూటమి గురించి ప్రజలకెలా అవగాహన కల్పించాలనే విషయాలను చర్చించేందుకు నాయకులు మంగళవారం సమావేశం అయ్యారు. 'ఈసారి జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయని బంగాల్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఈ సందర్భంగా వివరించింది. వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది.

ఇదీ చదవండి:కోర్టుకు రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.