ETV Bharat / bharat

పేదల గళం వినిపించేందుకు కాంగ్రెస్​ 'స్పీక్​అప్​' - Congress lockdown activities

కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల కష్టాలను తెలియజేస్తూ.. వారి గళాన్ని వినిపించేలా కాంగ్రెస్​ 'స్పీక్​అప్'​ ప్రచారాన్ని చేపట్టనుంది. ఈ ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల​ వేదికగా గురువారం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రతినిధి తెలిపారు.

Cong to launch 'SpeakUp' campaign
పేదల గళం వినిపించేలా కాంగ్రెస్​ 'స్పీక్​అప్​' ప్రచారం!
author img

By

Published : May 28, 2020, 6:04 AM IST

Updated : May 28, 2020, 6:46 AM IST

కాంగ్రెస్​ పార్టీ మరో విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్రానికి.. పేదలు, వలసదారులు సహా చిన్న, మధ్య తరగతి ప్రజల గళాన్ని వినిపించడానికి 'స్పీక్​అప్'​ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా సానుభూతిపరులు గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని సాగిస్తారని కాంగ్రెస్​ ప్రతినిధి అజయ్​ మాకెన్​ తెలిపారు.

వలసదారులందరూ క్షేమంగా ఇంటికి చేరేలా చూడాలని కేంద్రాన్ని కోరనున్నట్లు అజయ్​ వెల్లడించారు. వారికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తూ.. వేతనాన్ని రూ.200కు పెంచాలని సూచించారు. అంతేకాకుండా వారికి రూ.10వేల తక్షణ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: గుర్రానికీ తప్పని క్వారంటైన్​

Last Updated : May 28, 2020, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.