అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు వారికి మేలు చేకూర్చేలా ఉందన్నారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. పార్టీ జారీ చేసిన విప్ చెల్లుబాటు కాదని చెప్పి, ప్రజా తీర్పును ఉల్లంఘించి ద్రోహం చేసిన వారికి రక్షణ కల్పించేలా ఉందన్నారు. ఫిరాయింపు చట్టాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన ఈ తీర్పు న్యాయవ్యవస్థ పనితీరు నిదర్శనంగా నిలుస్తోందన్నారాయన.
-
SC’s order nullifying the Whip & by extension, operation of Constitution’s Xth Schedule to punish MLA’s betraying the public mandate, sets a terrible judicial precedent!
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Blanket protection to MLA’s, who are driven not by ideology but by far baser concerns, is unheard-of.
1/2 pic.twitter.com/SsNmxw5NCn
">SC’s order nullifying the Whip & by extension, operation of Constitution’s Xth Schedule to punish MLA’s betraying the public mandate, sets a terrible judicial precedent!
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2019
Blanket protection to MLA’s, who are driven not by ideology but by far baser concerns, is unheard-of.
1/2 pic.twitter.com/SsNmxw5NCnSC’s order nullifying the Whip & by extension, operation of Constitution’s Xth Schedule to punish MLA’s betraying the public mandate, sets a terrible judicial precedent!
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2019
Blanket protection to MLA’s, who are driven not by ideology but by far baser concerns, is unheard-of.
1/2 pic.twitter.com/SsNmxw5NCn
"విప్ చెల్లుబాటు కాదని సుప్రీం చెప్పింది. ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను ఈ తీర్పు ప్రశ్నార్థకంగా మార్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించేలా ఈ తీర్పు ఉంది."
-రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్.
గతంలో ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చేందుకు భాజపా చేసిన చట్ట వ్యతిరేక ప్రయత్నాలను అడ్డుకుని.. 2016 మేలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు సుర్జేవాలా.
శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీం బధవారం తీర్పు వెలువరించింది. రాజీనామాలు ఆమోదించాలన్న అభ్యర్థనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినా.... బలపరీక్షకు ముందు రెబల్స్‌కు ఉపకరించేలా కీలక ఆదేశాలిచ్చింది.
గురువారం బలపరీక్షకు హాజరుకావాలా లేదా అనే అంశంపై రెబల్ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే రాజీనామాలపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఒత్తిడి చేయలేమని సుప్రీం తెలిపింది. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే జారీ చేసిన మూడు లైన్ల విప్ చెల్లదని తేల్చిచెప్పింది.
తీర్పును స్వాగతించిన డీకే శివకుమార్
అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతించారు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.
ఇదీ చూడండి: కుల్‌భూషణ్ మరణ శిక్ష నిలిపేసిన ఐసీజే