వైద్యఆరోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలను పెంచడానికి లాక్‌డౌన్ కాలాన్ని ఉపయోగించకుండా కేంద్రం సమయాన్ని వృథా చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుండటంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌వల్లభ్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్22 నాటికి కేంద్రం కేవలం 1,340 వెంటిలేటర్లను మాత్రమే సేకరించగలిగిందని విమర్శించారు. జూన్ చివరి నాటికి 60 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉంటాయన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను గౌరవ్ గుర్తుచేశారు.
వెంటిలేటర్ల ఆర్డర్లలో గందరగోళం నెలకొందని, పీఎం కేర్స్‌నిధిని ఖర్చు చేయటంలో పారదర్శకత లోపించిందని ఆరోపించింది కాంగ్రెస్. వెంటిలేటర్ల కొనుగోలుకు సంబంధించి 2వేల కోట్ల రూపాయిలను పీఎం కేర్స్ ఫండ్‌నుంచి కేంద్రం ఖర్చుచేస్తున్నట్లు పేర్కొంది. రూ 1.5 లక్షల విలువైన వెంటిలేటర్‌ను రూ.4 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపించింది.
ఇదీ చూడండి: 'ఆర్థిక మంత్రి ఓ కాల నాగు- వెంటనే రాజీనామా చేయాలి'