కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. బిల్లుల ఆమోదం అనంతరం సభ వాయిదా పడినా కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఎగువసభ లోపలే నిరసనకు దిగారు. బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుల ఆమోదం సమయంలో.. విపక్షాలు అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాయని అన్నారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. విపక్షాలు రైతు వ్యతిరేకులు అని, ఈ చర్యను భాజపా తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
''విపక్షాల బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దురదృష్టకరం. వారు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఛైర్మన్ తగిన చర్యలు తీసుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగాలి. దానిని దుర్వినియోగపరచకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరుతున్నాం.''
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు