కాంగ్రెస్‌లో 'నాయకత్వ శూన్యత'పై ఆ పార్టీ బహిష్కృత నేత సంజయ్ ఝా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ సారథిని మార్చాలని పార్టీలోని 100 మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాశారని సంజయ్ ఆరోపించారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితిపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
-
It is estimated that around 100 Congress leaders (including MP's) , distressed at the state of affairs within the party, have written a letter to Mrs Sonia Gandhi, Congress President, asking for change in political leadership and transparent elections in CWC.
— Sanjay Jha (@JhaSanjay) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch this space.
">It is estimated that around 100 Congress leaders (including MP's) , distressed at the state of affairs within the party, have written a letter to Mrs Sonia Gandhi, Congress President, asking for change in political leadership and transparent elections in CWC.
— Sanjay Jha (@JhaSanjay) August 17, 2020
Watch this space.It is estimated that around 100 Congress leaders (including MP's) , distressed at the state of affairs within the party, have written a letter to Mrs Sonia Gandhi, Congress President, asking for change in political leadership and transparent elections in CWC.
— Sanjay Jha (@JhaSanjay) August 17, 2020
Watch this space.
"పార్టీ అంతర్గత వ్యవహారాలపై నిరాశ వ్యక్తం చేస్తూ దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి లేఖలు రాశారు. రాజకీయ నాయకత్వాన్ని మార్చి, పారదర్శకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు."
-సంజయ్ ఝా ట్వీట్
అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఖండించారు. ఫేస్బుక్ వివాదం(భాజపాకు ఫేస్బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల) నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ఈ విషయాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
-
TO WHOM IT MAY CONCERN
— Randeep Singh Surjewala (@rssurjewala) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
“Special Misinformation Group on Media-TV Debate Guidance” in its what’sapp of today directed to run the story of a non existant letter of Congress leaders to divert attention from Facebook-BJP links.
Of course, BJP stooges have started acting upon it.
">TO WHOM IT MAY CONCERN
— Randeep Singh Surjewala (@rssurjewala) August 17, 2020
“Special Misinformation Group on Media-TV Debate Guidance” in its what’sapp of today directed to run the story of a non existant letter of Congress leaders to divert attention from Facebook-BJP links.
Of course, BJP stooges have started acting upon it.TO WHOM IT MAY CONCERN
— Randeep Singh Surjewala (@rssurjewala) August 17, 2020
“Special Misinformation Group on Media-TV Debate Guidance” in its what’sapp of today directed to run the story of a non existant letter of Congress leaders to divert attention from Facebook-BJP links.
Of course, BJP stooges have started acting upon it.
"ఫేస్బుక్-భాజపా లింకుల గురించి దృష్టిమరల్చేందుకు అసలు ఉనికిలోనే లేని లేఖల గురించి ప్రస్తావించాలని 'ప్రత్యేక తప్పుడు సమాచార గ్రూప్' వాట్సాప్‌లో ఆదేశించింది. భాజపా మనుషులు ఈ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నారు."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
కాంగ్రెస్ తన అధికారిక ప్రకటనలో సైతం లేఖల విషయాన్ని ఖండించింది. ప్రస్తుతం ఝా.. కాంగ్రెస్ ప్రతినిధి కాదని పేర్కొంది. ఫేస్‌బుక్‌కు, భాజపాకు మధ్య ఉన్న లింకుల విషయంపై దృష్టిమరల్చేందుకే అధికార పార్టీ ఆదేశాల మేరకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని స్పష్టం చేసింది.
మరోవైపు సామాజిక మాధ్యమాలను భాజపా మభ్యపెడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు 'ఫేస్బుక్ విద్వేష ప్రసంగాల నియమాలు భారత రాజకీయాలతో కలిసిపోయాయి- వివాదాస్పద రాజకీయ నేతపై నిషేధం విధించేందుకు సంస్థ ఎగ్జిక్యూటివ్ వ్యతిరేకించారు' అనే వార్తను కాంగ్రెస్ ప్రస్తావించింది.
సస్పెండ్
పార్టీ అంతర్గత వ్యవహారాలపై విమర్శలు చేసినందుకు ఝాను గత నెలలో కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అయితే పార్టీలో అసంతృప్తులు ఉన్నారని సంజయ్ పేర్కొనడం ఇదే తొలిసారేం కాదు. పార్టీలో ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే పలుమార్లు నొక్కిచెప్పారు.
ఇదీ చదవండి- 'పద్మ విభూషణ్' పండిట్ జస్రాజ్ ఇకలేరు