త్వరలో జరగనున్న గుజరాత్ స్థానిక సంస్థల పోరు కోసం అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెంచారు. ఓటర్లను ఆకర్షించేందుకు సూరత్ ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పరూల్ విభిన్న ఆలోచన చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా.. జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల ఫొటోలున్న చీరలను ధరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేగాక కార్యకర్తల కోసం సుమారు 1000 చీరలను సిద్ధం చేయిస్తున్నారు.
26 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే..
26 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు ఈ ఎన్నికల్లో రెండు టికెట్లు దక్కుతాయని పరూల్ దంపతులు ఆశించారు. ఓబీసీ కోటాలో ఆమె పోటీ చేస్తుండగా.. ఆమె భర్తకు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ నాయకుల ఫొటోలను ప్రింట్ చేయించిన చీరలతో ఓటర్ల దృష్టిని ఆకర్షించి.. ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ టీ-షర్టులతో పాటు.. కాంగ్రెస్ గుర్తుతో ఉన్న మాస్కులను తమ కార్యకర్తలకు పంచనున్నట్టు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్ వరాల జల్లు