దేశంలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. భారత్కు కాంగ్రెస్ చేయాల్సిన సేవ ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ప్రజల ఉద్వేగాలను వాడుకుని భాజపా గెలిచిందని ఆరోపించారు.
"స్వతంత్ర భారతంలో 70 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలపై చర్చ జరగకపోవటం నన్ను బాధించింది. కులం, మతం, జాతీయవాదం, సైన్యం సాధించిన విజయాలను పేర్కొంటూ అబద్ధాలతో భాజపా అధికారాన్ని పొందింది. సమస్యల పరిష్కారం దిశగా రాహుల్ గాంధీ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ ఎన్నటికీ అంతం కాదు. ఇప్పుడు దేశానికి కాంగ్రెస్ కావాలి. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా పార్లమెంట్లో మేం పోరాడతాం. ప్రతిపక్ష పాత్రలో ప్రజల సమస్యలను లేవనెత్తుతాం."
-అశోక్ గెహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: నేడు పార్లమెంట్లో ఎన్డీఏ సభ్యుల భేటీ