అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో కీలక మార్పులు చేశారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. అనూహ్యంగా ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి కొంత మంది సీనియర్ నేతలను తొలగించారు. వీరిలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, మోతీ లాల్ వోరా, లుజెనియో ఫలేరియో, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో తనకు సహాయకంగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు.
కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ, దాని కేంద్ర ఎన్నికల విభాగాన్ని కూడా పునర్వ్యవస్థీకరించింది హస్తం పార్టీ. పి.చిదంబరం, రణ్‌దీప్ సుర్జేవాలా, తారీఖ్ అన్వర్, జితేంద్ర సింగ్ వంటి నేతలను సాధారణ సభ్యులుగా నియమించింది.
సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల బృందంలో.. ఆజాద్, శర్మను సాధారణ సభ్యులుగా కొనసాగుతున్నారు. జితిన్ ప్రసాదను శాశ్వత సభ్యులుగా నియమించారు.
కర్ణాటక ఇన్ఛార్జిగా సుర్జేవాలా, బంగాల్‌కు జితిన్ ప్రసాదను నియమించారు సోనియా.
ఇదీ చదవండి: రూ.16 వేల కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ