కర్ణాటకలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చిన గవర్నర్, కోరిన యడ్యూరప్పపై కాంగ్రెస్, జేడీఎస్ విమర్శలు గుప్పించాయి. రాజ్యాంగ విరుద్ధంగా యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ ఖూనీ చేశారని ఆరోపించారు ఇరు పార్టీల నేతలు.
అవినీతికి ప్రతిరూపం, మాజీ జైలు పక్షి అంటూ యడ్యూరప్పను ఎద్దేవా చేసింది కర్ణాటక కాంగ్రెస్. యడ్యూరప్ప జైలుకెళ్లగా ముగిసిన 2008-11 మధ్య కాలంలోని ఘోరమైన పాలనను కన్నడ ప్రజలు ఇప్పట్లో మరిచిపోలేరని వ్యాఖ్యానించింది.
-
Corruption Icon and Former Jail Bird Shri @BSYBJP has used his excellent Horse Trading skills to subvert democracy and come to power.
— Karnataka Congress (@INCKarnataka) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
People of Karnataka remember his disastrous tenure as CM between 2008-2011, which ended with BSY in Jail.
History is all set to repeat again. https://t.co/0M28Z49PQM
">Corruption Icon and Former Jail Bird Shri @BSYBJP has used his excellent Horse Trading skills to subvert democracy and come to power.
— Karnataka Congress (@INCKarnataka) July 26, 2019
People of Karnataka remember his disastrous tenure as CM between 2008-2011, which ended with BSY in Jail.
History is all set to repeat again. https://t.co/0M28Z49PQMCorruption Icon and Former Jail Bird Shri @BSYBJP has used his excellent Horse Trading skills to subvert democracy and come to power.
— Karnataka Congress (@INCKarnataka) July 26, 2019
People of Karnataka remember his disastrous tenure as CM between 2008-2011, which ended with BSY in Jail.
History is all set to repeat again. https://t.co/0M28Z49PQM
'' 'అవినీతికి మారుపేరు, మాజీ జైలు పక్షి' యడ్యూరప్ప.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అద్భుతమైన నైపుణ్యంతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు.''
- కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్
ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా.. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది జేడీఎస్.
-
#HorseTradingParty of India has "claimed" stake to form govt even though they don't meet the magic number 112.
— Janata Dal Secular (@JanataDal_S) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Today marks one of the darkest days in the history of Karnataka. Democracy is dying a slow death because of BJP's unconstitutional practices.#HorseTraderYeddyurappa https://t.co/pi5jcqFcdf
">#HorseTradingParty of India has "claimed" stake to form govt even though they don't meet the magic number 112.
— Janata Dal Secular (@JanataDal_S) July 26, 2019
Today marks one of the darkest days in the history of Karnataka. Democracy is dying a slow death because of BJP's unconstitutional practices.#HorseTraderYeddyurappa https://t.co/pi5jcqFcdf#HorseTradingParty of India has "claimed" stake to form govt even though they don't meet the magic number 112.
— Janata Dal Secular (@JanataDal_S) July 26, 2019
Today marks one of the darkest days in the history of Karnataka. Democracy is dying a slow death because of BJP's unconstitutional practices.#HorseTraderYeddyurappa https://t.co/pi5jcqFcdf
''ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటుతో సభలో శాసనసభ్యుల సంఖ్య 222. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 112. అయినా.. 105 మంది ఎమ్మెల్యేలున్న యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను ఎలా కలుస్తారు. ''
- జేడీఎస్ ట్వీట్
ఏ ఆర్టికల్ చెబుతోంది...
కన్నడ అసెంబ్లీ భాజపా ప్రయోగాలకు వేదికగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య. 105 మంది సభ్యులతో ఉన్న భాజపా... తగిన సంఖ్యాబలానికి చాలా దూరంలో ఉందన్నారాయన.
-
.@BJP4Karnataka has the strength of 105 which is way less than the half way mark.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
In no way BJP can form the govt if constitution is followed. This only proves that BJP has no belief in the democratic values.@INCKarnataka
">.@BJP4Karnataka has the strength of 105 which is way less than the half way mark.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019
In no way BJP can form the govt if constitution is followed. This only proves that BJP has no belief in the democratic values.@INCKarnataka.@BJP4Karnataka has the strength of 105 which is way less than the half way mark.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019
In no way BJP can form the govt if constitution is followed. This only proves that BJP has no belief in the democratic values.@INCKarnataka
-
Karnataka assembly has become an experimental lab for @BJP4Karnataka & BJP backed governor to try unconstitutional ways to form govt.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
In what article of the constitution is the governor allowed to permit the party to form govt that doesn't have majority?
It is shame!!
">Karnataka assembly has become an experimental lab for @BJP4Karnataka & BJP backed governor to try unconstitutional ways to form govt.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019
In what article of the constitution is the governor allowed to permit the party to form govt that doesn't have majority?
It is shame!!Karnataka assembly has become an experimental lab for @BJP4Karnataka & BJP backed governor to try unconstitutional ways to form govt.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2019
In what article of the constitution is the governor allowed to permit the party to form govt that doesn't have majority?
It is shame!!
''రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న కర్ణాటక భాజపాకు.. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న గవర్నర్కు కన్నడ అసెంబ్లీ ప్రయోగశాలగా మారింది. మెజార్టీ లేకుండా ఏదైనా పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని రాజ్యాంగంలోని ఏ అధికరణ చెబుతోంది. ఇది హేయమైన చర్య. రాజ్యాంగాన్ని అనుసరిస్తే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమే లేదు.''
- సిద్ధరామయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత
కన్నడ నాట కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన రెండు రోజుల అనంతరం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ను కోరారు యడ్యూరప్ప. నేడు ప్రమాణస్వీకారానికి అంగీకరించిన గవర్నర్ వాజుభాయ్ వాలా... జులై 31 వరకు సభలో బలం నిరూపించుకోవాలని యడ్డీకి గడువు విధించారు.