'అభివృద్ధి ఛాయ లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోదీ సర్కార్‌కు అభినందనలు' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.
భాజపా సర్కార్‌కు సరైన నాయకత్వం, ఓ దశాదిశా లేవని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనాన్ని నియంత్రించే కనీస ప్రణాళికలు కూడా మోదీ సర్కార్ వద్ద లేవని ఆరోపించారు.
"మోదీ సర్కార్‌కు అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని నిరంతరం అణిచివేస్తూ, విమర్శించే మీడియా గొంతునొక్కేస్తున్నారు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే నాయకత్వం, దశ, ప్రణాళికులు లేని మీకు శుభాకాంక్షలు"
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్‌షా