ETV Bharat / bharat

'పెట్రో ధరల పెంపుపై రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు' - K C Venugopal

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం(జూన్​ 29న) దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ తెలిపింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ.. రాష్ట్రపతికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో పాటు కార్యకర్తలు వినతి పత్రాలు పంపనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ దోపిడీని ఎండగట్టటమే ఆందోళనల లక్ష్యమని పేర్కొంది.

Cong to hold protests
'పెట్రో ధరల పెంపుపై సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు'
author img

By

Published : Jun 28, 2020, 10:03 AM IST

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది కాంగ్రెస్​. ధరల పెంపునకు నిరసనగా సోమవారం (జూన్​ 29న) దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపింది. ధరలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వినతి పత్రాలు అందజేస్తారని వెల్లడించింది.

కొవిడ్​-19 సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలపై కేంద్రం ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందో ప్రజలకు చెప్పడమే ఈ ఆందోళనల లక్ష్యమని పేర్కొన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​.

"జూన్​ 30 నుంచి జులై 4వ తేదీ వరకు తాలూక, తహసీల్​, బ్లాక్​ స్థాయుల్లో కాంగ్రెస్​ భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతుంది. వరుసగా 21 రోజుల పాటు పెట్రోల్​, డీజిల్​ ధరలను ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. దీంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు ఇవ్వకుండా.. పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం పెంచుతూ భారీ లాభాలను కేంద్రం ఆర్జిస్తోంది."

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి

భౌతిక దూరం పాటిస్తూనే..

పెట్రోల్​ ధరల పెంపుపై సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు భౌతిక దూరం నియమాలు పాటిస్తూనే ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు వేణుగోపాల్​. ఈ కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు పీసీసీ, డీసీసీల ఆధ్వర్యంలో విజయవంతం చేస్తారని తెలిపారు.

సామాజిక మాధ్యమాల వేదికగా..

ఓ వైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే అదే రోజు సామాజిక మాధ్యమాల వేదికగా 'స్పీక్​ అఫ్​​ ఆన్​ పెట్రోల్​, డీజిల్​ ప్రైస్​ హైక్' ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు వేణుగోపాల్​. దీని ద్వారా రైతులు, టాక్సీ, బస్​ యజమానులు, రవాణా, ఓలా, ఉబర్​ డ్రైవర్స్​ కార్మికులు, సామాన్యులు పడే ఇబ్బందులను తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.