బాలాకోట్ మెరుపుదాడులపై కేంద్రమంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా వ్యాఖ్యల అనంతరం అధికార భాజపాపై విమర్శల దాడిని తీవ్రం చేసింది కాంగ్రెస్. ప్రధాని నరేంద్రమోదీ... ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు ఆ పార్టీ అగ్రనేతలు. భారత వాయుసేన దాడికి సంబంధించి ఆధారాలు కావాల్సిందేనని డిమాండ్ చేశారు.
Modiji :
— Kapil Sibal (@KapilSibal) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Is international media :
1) New York Times
2) London based Jane's Information Group
3) Washinton Post
4) Daily Telegraph
5) The Guardian
6) Reuters
reporting no proof of militant losses at Balakot pro-Pakistan ?
You are guilty of politicising terror ?
">Modiji :
— Kapil Sibal (@KapilSibal) March 4, 2019

You are guilty of politicising terror ?Modiji :
— Kapil Sibal (@KapilSibal) March 4, 2019
Is international media :
1) New York Times
2) London based Jane's Information Group
3) Washinton Post
4) Daily Telegraph
5) The Guardian
6) Reuters
reporting no proof of militant losses at Balakot pro-Pakistan ?
You are guilty of politicising terror ?
''న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, లండన్ ఆధారిత జేన్ సమాచార సంస్థ, డైలీ టెలిగ్రాఫ్, ద గార్డియన్, రాయిటర్స్ వంటివి పాకిస్థాన్ బాలాకోట్‌లో ఉగ్రవాదులు హతం అయ్యారనేందుకు ఆధారాలేమీ లేవని వార్తలు ప్రచురించాయి. మోదీ దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఉగ్రవాదాన్ని రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు.''
- కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఎస్ఎస్ అహ్లువాలియాకు సంబంధించిన వార్తను ట్వీట్‌కు జోడించారు.
मोदी जी,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
आपके केंद्रीय मंत्री TV चैनल की ख़बरों को झूठला रहे हैं, यह कह कर की बालाकोट हवाई हमले में 300 उग्रवादियों के मारे जाने की पुष्टि PM ने कभी नहीं की।
क्या यह सच है?
अगर नहीं तो PM देश को सच बताएँ।
सादर,
देश के नागरिक। pic.twitter.com/Zc3J6B96OI
">मोदी जी,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 4, 2019
आपके केंद्रीय मंत्री TV चैनल की ख़बरों को झूठला रहे हैं, यह कह कर की बालाकोट हवाई हमले में 300 उग्रवादियों के मारे जाने की पुष्टि PM ने कभी नहीं की।
क्या यह सच है?
अगर नहीं तो PM देश को सच बताएँ।
सादर,
देश के नागरिक। pic.twitter.com/Zc3J6B96OIमोदी जी,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 4, 2019
आपके केंद्रीय मंत्री TV चैनल की ख़बरों को झूठला रहे हैं, यह कह कर की बालाकोट हवाई हमले में 300 उग्रवादियों के मारे जाने की पुष्टि PM ने कभी नहीं की।
क्या यह सच है?
अगर नहीं तो PM देश को सच बताएँ।
सादर,
देश के नागरिक। pic.twitter.com/Zc3J6B96OI
''మోదీజీ... మీ కేంద్రమంత్రి టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలను కల్పితమైనవని పేర్కొన్నారు. బాలాకోట్ వైమానిక దాడిలో 300మంది ఉగ్రవాదులు చనిపోయారని మోదీ ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇది నిజమా? ఒకవేళ కాకపోతే... మోదీ కచ్చితంగా దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే. నిజమేంటో చెప్పాలి. ''
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా సిలిగుడిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కానీ, ఏ ఇతర ప్రభుత్వ ప్రతినిధులు వైమానిక దాడి నష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. భారత మీడియా, సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. గందరగోళంలో పడేసే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మోదీని వివరణ కోరింది.
''300 మంది ఉగ్రవాదులు మరణించారనేది నిజమా? కాదా? ప్రయోజనమేముంది? మీరు నిర్మూలించేది ఉగ్రవాదులనా... చెట్లనా. ఇది ఎన్నికల గిమ్మిక్కేనా.?'' అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.
Stop politicising the army for your political motives
— Navjot Singh Sidhu (@sherryontopp) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Army is as sacred as the state!
Stop deflecting the real issues, they will come back to haunt you
Job loss
Black money
1708 terrorist acts
NPAs
Farmer Suicides
All this gone, because your ‘so-called’ propaganda war is on.. pic.twitter.com/T8gnoZVPkl
">Stop politicising the army for your political motives
— Navjot Singh Sidhu (@sherryontopp) March 4, 2019
Army is as sacred as the state!
Stop deflecting the real issues, they will come back to haunt you
Job loss
Black money
1708 terrorist acts
NPAs
Farmer Suicides
All this gone, because your ‘so-called’ propaganda war is on.. pic.twitter.com/T8gnoZVPklStop politicising the army for your political motives
— Navjot Singh Sidhu (@sherryontopp) March 4, 2019
Army is as sacred as the state!
Stop deflecting the real issues, they will come back to haunt you
Job loss
Black money
1708 terrorist acts
NPAs
Farmer Suicides
All this gone, because your ‘so-called’ propaganda war is on.. pic.twitter.com/T8gnoZVPkl
అవమానించడమే...
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భాజపా అంతే స్థాయిలో బదులిచ్చింది.
''ఉగ్రవాద వ్యతిరేక భద్రతా దళాల చర్యను కాంగ్రెస్.. ఆ పార్టీ మిత్రపక్షాలు భవిష్యత్తులోనూ స్వాగతించే అవకాశమే లేదు. కానీ... కనీసం దేశాన్ని తప్పుదోవ పట్టించకుండా ఉంటే చాలు. నకిలీ, కల్పిత కథనాలతో సాయుధ దళాలను అవమానించవద్దు.''
- ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మంత్రి