ETV Bharat / bharat

సరిహద్దు ఉద్రిక్తతలపై కాంగ్రెస్ తీవ్ర​ ఆందోళన - cogress on soldiers death at china border

భారత్​- చైనా మధ్య జరిగిన భౌతిక ఘర్షణలో ముగ్గురు భారత జవాన్ల మృతిపై కాంగ్రెస్ స్పందించింది. చైనా ఆర్మీ చేతిలో.. సైనికులను పోగొట్టుకోవడం విచారం కలిగించిందని పేర్కొంది. పరిస్థితిని ధృవీకరించమని రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్​.. దీనిపై రాజకీయ పార్టీలతో చర్చించాలని డిమాండ్​ చేసింది.

Cong says shocking death of Indian Army officer, 2 soldiers in face off with Chinese Army
"చైనా చేతిలో భారత జవాన్ల మృతి నమ్మలేనిది "
author img

By

Published : Jun 16, 2020, 4:34 PM IST

​భారత్​-చైనా సరిహద్దులో తాజా పరిస్థితులపై స్పందించిన కాంగ్రెస్​.. జవాన్ల మృతిపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఆమోదనీయం కాదని అని నొక్కిచెప్పింది.

'ఈ ఘటన నమ్మలేనిది, ఒప్పుకోదగనిది, ఆమోదయోగ్యం కానిది. ఈ ఘటనను రక్షణ మంత్రి ధృవీకరిస్తారా?' అని ఆ పార్టీ అధికార ప్రతినిధి... రణదీప్​ సుర్జేవాలా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ఆనంద్​ శర్మ. రాజకీయ పార్టీలతో అత్యవసరంగా సమావేశమై.. సరిహద్దు క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఓ అధికారి, ఇద్దరు సైనికులు.....

భారత్​- చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణలో ఓ కల్నల్​ అధికారి సహా ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. లద్ధాక్​​లోని గాల్వన్​ లోయ వద్ద ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి:ఉద్రిక్తతల వేళ ప్రధానితో రక్షణమంత్రి భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.