ETV Bharat / bharat

'చైనా నిఘా'పై కేంద్రానికి కాంగ్రెస్ ప్రశ్నలు - K C Venugopal in parliament

చైనా దురాక్రమణలు, దుశ్చర్యలపై పార్లమెంట్​ వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్​. భారత్​కు చెందిన 10వేల మంది ప్రముఖులు, సంస్థల డేటాను చైనా టెక్నాలజీ సంస్థ సేకరించినట్లు వచ్చిన వార్తలను ఉభయసభల్లో లేవనెత్తింది. చైనా డిజిటల్​ దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు సరైన ఫైర్​వాల్​ను రూపొందించాలని కోరారు కాంగ్రెస్​ నేతలు.

alleged surveillance by Chinese company
'10వేల మంది ప్రముఖులు, సంస్థల డేటా చోరీ ఆందోళనకరం'
author img

By

Published : Sep 16, 2020, 7:51 PM IST

భారతలోని 10వేల మందికిపైగా ప్రముఖులు, సంస్థలపై చైనా నిఘా వ్యవహారాన్ని పార్లమెంట్​ ఉభయసభల్లో ప్రస్తావించారు కాంగ్రెస్​ సభ్యులు. పొరుగు దేశం డిజిటల్​ దుస్సాహసాలను ఎదుర్కొనేందుకు సరైన ఫైర్​వాల్​ను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాజ్యసభ శూన్యగంటలో 'చైనా నిఘా'పై కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్​ సభ్యులు కేసీ వేణు గోపాల్, రాజీవ్ సతావ్.

"చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్​ పార్టీకి సంబంధాలు ఉన్న షెన్​జెన్​లోని టెక్నాలజీ సంస్థ భారత్​లోని 10వేల మంది ప్రముఖులు, సంస్థల సమాచారాన్ని సేకరించినట్లు ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ కథనం ప్రచురించింది. ఇందులో భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధామమంత్రి, కాంగ్రెస్​ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, సైన్యాధిపతి​, పారిశ్రామికవేత్తలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కీలక పదవుల్లో ఉన్న అధికారులు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, నటులు, క్రీడాకారులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తల సమాచారాన్నీ చైనా దొంగిలించింది. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అంశం. దీనిపై ప్రభుత్వానికి సమాచారం ఉందా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం."

- కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ ఎంపీ.

చైనా నిఘాకు సంబంధించి వార్తల్లో నిజానిజాలేంటో తెలుసుకుని, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చూడాలని సంబంధిత మంత్రికి సూచించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి నిర్దేశించారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

లోక్​సభలో..

కరోనా మహమ్మారి వ్యాప్తి, లద్దాఖ్​లో దురాక్రమణతో పాటు.. ప్రస్తుతం డిజిటల్​ దుస్సాహసం వెనుక చైనా ఉందన్నారు లోక్​సభలో కాంగ్రెస్ పక్ష​ నేత అధిర్​ రంజన్​ చౌదరి. జాతీయ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా డిజిటల్​ దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు దీటైన ఫైర్​వాల్​ను రూపొందించాలని ఐటీ మంత్రి రవిసంకర్​ ప్రసాద్​ను కోరారు.

ఇదీ చూడండి: లద్దాఖ్​లో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం: సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.