ETV Bharat / bharat

కాంగ్రెస్​లో పదవులపై పైలట్ కీలక వ్యాఖ్యలు - Rajasthan congress

రాజస్థాన్​ రెబల్​ ఎమ్మెల్యేల సమస్యలకు త్రిసభ్య కమిటీ పరిష్కారం చూపుతుందనే నమ్మకం ఉందన్నారు సచిన్​ పైలట్​. ప్రభుత్వంలో లేదా పార్టీ​లో ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కాంగ్రెస్​ నాయకత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

Cong leadership to decide who will work in govt or party organisation: Sachin Pilot
ఎవరు ఏం చేయాలో పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది: పైలట్​
author img

By

Published : Aug 19, 2020, 6:16 PM IST

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో లేదా పార్టీ​లో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్​ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు సచిన్​ పైలట్​. అన్ని సమస్యలకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ​ పరిష్కారం కనుగొంటుందనే నమ్మకం ఉందన్నారు.

కమిటీ​ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్​ అధ్యక్షురాలికి నా కృతజ్ఞతలు. కమిటీ తనపని తాను పూర్తి చేస్తుంది. వారు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు ఉంటాయి. ఏ పనైనా.. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో జరగాలి. ప్రభుత్వంలో, పార్టీ​లో ఎవరు పని చేయాలనే తుది నిర్ణయాన్ని అధిష్ఠానం తీసుకుంటుంది. అన్ని సమస్యలను కమిటీతో చర్చిస్తాం.

- సచిన్​ పైలట్​, రాజస్థాన్​ మాజీ ఉపముఖ్యమంత్రి.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాజస్థాన్​ వ్యవహారాల ఇంఛార్జిగా కొత్తగా నియమితులైన అజయ్​ మాకెన్​తో సోమవారం భేటీ అయ్యారు పైలట్​. ఈ సందర్భంగా రెబల్​ ఎమ్మెల్యేల సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఇక ఒకే పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.