ETV Bharat / bharat

పరీక్షల వాయిదా కోసం కాంగ్రెస్​ నిరసనలు - రాహుల్​ గాంధీ న్యూస్​

నీట్​, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. విద్యార్థుల భద్రత కోసం ప్రజలంతా ఏకమై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాలని రాహుల్​ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

Cong launches campaign against holding of NEET, JEE; Rahul asks people to speak up for students' safety
విద్యార్థులకు అండగా గళమెత్తండి: రాహుల్​
author img

By

Published : Aug 28, 2020, 2:49 PM IST

దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల కోసం ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనా సమయంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్​. #SpeakUpForStudentSafety హ్యాష్​ట్యాగ్​ను జతచేసి వీడియో షేర్​ చేశారు.

" లక్షల మంది విద్యార్థుల కోసం మీరూ గళం కలపండి. విద్యార్థులు చెప్పే విషయాన్ని ఫ్రభుత్వం వినాలని డిమాండ్​ చేయండి."

-రాహుల్​ గాంధీ

ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని అధికారిక ట్విట్టర్​ ఖాతా ద్వారా పేర్కొంది కాంగ్రెస్​ పార్టీ. ఈ విషయంపై గళమెత్తిన తమ పార్టీ నాయకుల వీడియోలను షేర్ చేసింది.

దేశవ్యాప్తంగా నిరసనలు..

నీట్​, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఈరోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు.

రాజస్థాన్​లో

రాజస్థాన్​లో కాంగ్రెస్​ నేత సచిన్ పైలట్​ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు పదేపదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల కోసం నిర్ణయాన్ని మార్చుకోవాలని పైలట్​ డిమాండ్ చేశారు.

దిల్లీలో..

కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దిల్లీలోని శాస్త్రి భవన్​ వెలుపల కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తమిళనాడు రాజధాని చెన్నైలోనూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది.

  • Tamil Nadu: Congress workers in Chennai hold protest against Centre's decision to hold NEET-JEE 2020 exams amid COVID19 pandemic pic.twitter.com/wruQKgZuvB

    — ANI (@ANI) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ర్యాలీ నిర్వహించిన ఎన్​ఎస్​యూఐ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Ahmedabad: Members of National Students' Union of India (NSUI) detained by police during a protest against Centre's decision to conduct JEE & NEET examinations in September pic.twitter.com/51zpMb9EYy

ఇదీ చూడండి: నీట్, జేఈఈ వాయిదాకై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.