ETV Bharat / bharat

టార్గెట్ సచిన్... కాంగ్రెస్ కీలక నిర్ణయం

రాజస్థాన్​ కాంగ్రెస్​లోని జిల్లా, బ్లాక్​ కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏఐసీసీ. నూతన కమిటీలు త్వరలోనే ఏర్పడతాయని పేర్కొంది. సచిన్​ పైలట్​ అనుచరులను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Cong dissolves district, block committees in Rajasthan
రాజస్థాన్​లో పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్​ అడుగులు
author img

By

Published : Jul 15, 2020, 4:31 PM IST

సచిన్​ పైలట్​ వ్యవహారం అనంతరం రాజస్థాన్​లో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్​. అన్ని జిల్లా, బ్లాక్​ కమిటీలను రద్దు చేసింది. త్వరలోనే నూతన కమిటీలు ఏర్పడతాయని​ ఏఐసీసీ ప్రకటించింది.

పార్టీ బాధ్యతల నుంచి సచిన్​ అనుచరులను తొలగించేందుకే కాంగ్రెస్​ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

సచిన్​పై గహ్లోత్​ మండిపాటు...

రెబల్​ నేత సచిన్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తొలగించిన ఒక రోజు అనంతరం ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. భాజపాతో కలిసి సచిన్​ బేరసారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు జరిగిన కుట్రలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు.

ఇదే క్రమంలో జాతీయ మీడియాపై గహ్లోత్​ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారికి మీడియా మద్దతుగా నిలిస్తోందని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి:-

నేను భాజపాలో చేరడం లేదు: సచిన్​ పైలట్​

రాజస్థాన్​ రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

ట్విట్టర్​ బయో మార్పుతో కాంగ్రెస్​కు సచిన్​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.