ETV Bharat / bharat

చాయ్​వాలాగా మారిన సైన్స్​ గ్రాడ్యుయేట్​ - essay on economic impact of covid 19 in india

కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. అంబానీ లాంటి వారిని మరింత కుబేరులుగా మార్చితే.. మరికొందరిని రోడ్డు మీదకు లాగేసింది. దీంతో కొవిడ్​ సోకిన వారే కాక ఇతరులు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన శివప్రసాద్​. కంప్యూటర్​ సైన్స్ చదివినా ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు చాయ్​వాలాగా మారాడు.​

Computer Science Graduate Becomes Chai Wala to Re-Build the Life After the Effect of Corona in mangalore
'టీ' అమ్ముతున్న కంప్యూటర్​ సైన్స్​ గ్రాడ్యుయేట్​
author img

By

Published : Nov 5, 2020, 7:12 PM IST

చాయ్​వాలాగా మారిన సైన్స్​ గ్రాడ్యుయేట్​

కరోనా కట్టడి దిశగా ఆయా దేశాల ప్రభుత్వాలు తీసుకున్న లాక్​డౌన్ నిర్ణయం చాలా మందికి నష్టాన్ని మిగిల్చింది. ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపింది. ఇలానే జీవనోపాధి కోల్పోయాడు శివప్రసాద్​ అనే యువకుడు. కంప్యూటర్​ సైన్స్ చదివిన ప్రసాద్​.. అంతకు మునుపు దుబాయ్​లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కొవిడ్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఉద్యోగం కోల్పోయాడు. భారత్​కు తిరిగివచ్చిన తర్వాత రోడ్లపై టీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

టీ అమ్ముతూ..

ఉద్యోగం కోల్పోయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చాడు శివప్రసాద్​​. తన సొంత ఊరు అయిన కర్ణాటక కడబ తాలూకాలో వేకువజాము నుంచి ఉదయం ఓ నిర్ణీత సమయం వరకు స్కూటర్​పై టీ తీసుకువెళ్లి అమ్ముతాడు. అలా రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.

''మనం చేసే పనితో సమాజానికి ఇబ్బంది లేనంత వరకూ ఏ పని అయినా చేయవచ్చు. టీ అమ్మడానికి నాకు ఇబ్బంది అనిపించడం లేదు. టీ అమ్మడం అయ్యాక మా తాతయ్య హోటల్​ చూసుకుంటాను. ఇలా చేయడం ఏమీ పరువు తక్కువ పని కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించడానికి ఇంతకు మించిన దారి లేదు. కష్టపడటంలో తప్పు లేదు.''

-శివప్రసాద్​

ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మాస్క్​లు తయారు చేసిందెవరు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.