ETV Bharat / bharat

'ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంది'

author img

By

Published : May 11, 2020, 5:48 PM IST

కరోనా కేసులు, మరణాల కట్టడిలో భారత్ ఎంతో మెరుగ్గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కొనియాడారు. అలాగే కొవిడ్​-19 వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడంలోనూ భారత్​ కీలక పాత్ర పోషించగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

WHO's chief scientist soumya swaminathan
సౌమ్య స్వామినాథన్

ప్రపంచదేశాలతో పోల్చితే భారత్​.. కరోనా కేసులు, మరణాలను బాగా నియంత్రించగలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్ ప్రశంసించారు. కొవిడ్​-19కు వ్యాక్సిన్ రూపొందించడంలోనూ భారత్​ కీలక పాత్ర పోషించగలదని ఆమె అభిప్రాయపడ్డారు. భారత జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సౌమ్య స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీకా అభివృద్ధి చేస్తే సరిపోదు..

మరిన్ని సంవత్సరాలపాటు కరోనాతో పోరాడటానికి ప్రపంచ దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సౌమ్య స్వామినాథన్ అన్నారు. టీకాను అభివృద్ధి చేయడం, పరీక్షించడం మాత్రమే సరిపోదని.. ప్రపంచ జనాభా అవసరాలకు తగిన స్థాయిలో వాటిని తయారు చేయాలని తెలిపారు. అలాగే వాటిని అందించేందుకు సరిపడా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని సౌమ్య స్పష్టం చేశారు.

10 ఏళ్లు పడుతుంది!.. కానీ

"సాధారణంగా ఓ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడానికి సుమారు 10 ఏళ్లు పడుతుంది. అయితే ఎబోలా విషయంలో ఐదేళ్లలోనే టీకాను రూపొందించారు. కానీ కరోనాను అంతమొందించేందుకు ఓ సంవత్సరంలోగా వ్యాక్సిన్ రూపొందించాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలు జ్ఞానం, వనరులు, సాధనాలు, పూలింగ్, క్లినికల్ ట్రయల్స్ విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగాలి." - సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​

సవాళ్లున్నాయ్...

ఐసీఎం​ఆర్​ డైరెక్టర్​ జనరల్​గానూ విధులు నిర్వర్తించిన సౌమ్య స్వామినాథన్... అధిక జనాభా, పట్టణ ప్రాంతాల్లో రద్దీ, గ్రామీణ ప్రాంతాల్లో తగిన ఆరోగ్య, వైద్య సదుపాయాల లేమి.. భారత్​ ముందున్న సవాళ్లని పేర్కొన్నారు.

వాస్తవానికి ప్రజారోగ్య పర్యవేక్షణ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, వైద్య, ఆరోగ్య సిబ్బందిని పెంచడానికి ఇదే సరైన సమయమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: మగవారిలో కరోనా ఇందుకే ఎక్కువట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.