భాజపా నాయకులపై ఓ వ్యక్తి షూ విసిరాడు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పత్రికా సమావేశం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖంపై నుంచి షూ దూసుకెళ్లింది. ఊహించని సంఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన వ్యక్తి వైద్యుడని సమాచారం.
దాడి సమయంలో భాజపా నాయకులు భూపేంద్ర యాదవ్, జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతున్నారు. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ వంటి హిందుత్వ కార్యకర్తలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు బనాయించి, వారిని అప్రతిష్ఠపాల్జేస్తోందని జీవీఎల్ ఆరోపిస్తుండగా ఈ ఘటన జరిగింది.