ETV Bharat / bharat

సెప్టెంబర్​ నుంచి దేశంలో 'కోడ్​ ఆన్ వేజెస్' అమలు!

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'కోడ్ ఆన్ వేజెస్'​ను ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కోడ్​కు సంబంధించిన నియమాలను ప్రభుత్వం అధికార గెజిట్​లో విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఫీడ్​బ్యాక్​ కోసం వీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Code on Wages likely to be implemented by Sept, Labour Min circulates draft rules
సెప్టెంబర్​ నుంచి దేశంలో కోడ్​ ఆన్ వేజెస్ అమలు!
author img

By

Published : Jul 9, 2020, 9:47 PM IST

కార్మిక చట్టాల సంస్కరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన 'ది కోడ్​ ఆన్ వేజెస్​ 2019'ను సెప్టెంబర్​ నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముసాయిదా నియమాలపై ఫీడ్​బ్యాక్​ కోసం కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉంచినట్లు వెల్లడించారు.

కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ఈ కోడ్​ను ఆమోదించింది. కార్మికుల సమస్యల పరిష్కారం సహా ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించే విధంగా కోడ్​ను రూపొందించింది. జులై 7న కార్మిక శాఖ నియమాలను అధికారిక గెజిట్​లో పొందుపర్చింది.

"ముసాయిదా నియమాలు.. 2020, జులై 7 నుంచి 45 రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజల ఫీడ్​బ్యాక్​ను పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ నాటికి ఈ కోడ్​ అమలవుతుంది."

-కార్మిక శాఖ సీనియర్ అధికారి

కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో కోడ్ ఆన్ వేజెస్ మొదటిది. మొత్తం 44 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా విభజించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన వైద్య భద్రత విభాగాలుగా మార్చాలని కసరత్తులు చేస్తోంది.

ఈ కోడ్​ వల్ల 50 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్​లో జరిగిన చర్చలో భాగంగా పేర్కొన్నారు. లోక్​సభలో ఈ బిల్లు 2019 జులై 30న పాసైంది. అదే ఏడాది ఆగస్ట్​ 2న రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది.

కోడ్​ వివరాలు

  • నాలుగు కార్మిక చట్టాలను ఇది ఏకం చేస్తుంది.
  • కనీస వేతన చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన వేతనాల చట్టాలను భర్తీ చేస్తుంది.
  • కోడ్​లో భాగంగా 'వేతనం'పై వేర్వేరు చట్టాల్లో ఉన్న 12 నిర్వచనాలను సరళీకృతం చేశారు.
  • కోడ్​ ప్రకారం.. రంగంతో సంబంధం లేకుండా అందరికీ కనీస వేతనాలు, సరైన సమయంలో చెల్లించాలి.
  • ముసాయిదా నియమాల ప్రకారం రోజుకు ఎనిమిది గంటల పని కల్పించాలి.
  • మహిళలు, ట్రాన్స్​జెండర్లకు వేతనాల్లో వివక్ష లేకుండా వారి హక్కులను కోడ్ పరిరక్షిస్తుంది.
  • 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించేలా కనీస జీవన ప్రమాణాల ఆధారంగా వేతన లెక్కింపు ఉంటుంది.
  • కూడు, గూడు, గుడ్డ పరిగణలోకి తీసుకొని సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ కనీస వేతనాన్ని లెక్కిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.