ETV Bharat / bharat

ట్రంప్ తాజ్​మహల్​ పర్యటనకు కోతుల బెడద - తాజ్​మహల్​ వద్ద కోతులు

తాజ్​మహల్​ వద్ద కోతుల బెడద తీవ్రంగా ఉందని, ట్రంప్​ సందర్శన నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యటకులు సూచిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తాజ్​మహల్​ వద్ద కోతుల సమస్యే లేదని చెబుతున్నారు.

CISF says no monkey scare at Taj Mahal
ట్రంప్ తాజ్​మహల్​ పర్యటనకు కోతుల బెడద
author img

By

Published : Feb 21, 2020, 5:27 PM IST

Updated : Mar 2, 2020, 2:21 AM IST

తాజ్​మహల్​ వద్ద కోతుల బెడద తీవ్రంగా ఉందని పర్యటకులు చెబుతున్నారు. త్వరలో ట్రంప్ తాజమహల్​​ సందర్శన కారణంగా కోతుల సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై సీఐఎస్​ఎఫ్​ కమాండెంట్​ బ్రిజ్​ భూషణ్​ స్పందించారు.

తాజ్​మహల్ వద్ద కోతుల బెడద లేదని తెలిపారు భూషణ్​. కొంతకాలంగా కోతుల సమస్య తగ్గిందని, ట్రంప్ సందర్శన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

"ఆరు నెలలుగా తాజ్​మహల్​ పరిసరాల్లో కోతుల బెడద తగ్గింది. ట్రంప్ పర్యటన సమయంలో సందర్శకులకు అనుమతి ఉండదు. కోతుల సమస్య లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం."

-బ్రిజ్​ భూషణ్​​, సీఐఎస్​ఎఫ్​ కమాండెంట్​

కేంద్ర పారా మిలటరీ, సీఐఎస్​ఎఫ్​ సిబ్బందితో తాజ్​మహల్​ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కోతులు తమ వస్తువులను ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పర్యటకులు ఫిర్యాదు చేయడం వల్ల భద్రత మరింత పెంచారు.

"తాజ్​మహల్​ వద్ద కోతులు పర్యటకులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు కోతుల సమస్య ఇలాగే ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాటికి తెలియదుగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడని."

-తన్వీర్​, పర్యటకుడు

ట్రంప్​ సందర్శన నేపథ్యంలో ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 24 గంటల పాటు తాజ్​మహల్​ సందర్శనపై అధికారులు ఆంక్షలు విధించారు.

ఇదీ చదవండి: నమస్తే ట్రంప్​: తాజ్​మహల్​ దారిపొడవునా ఆయన బొమ్మలే

Last Updated : Mar 2, 2020, 2:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.