లాక్డౌన్ విధించినప్పటి నుంచి మూతపడిన థియేటర్లు.. ఆ రాష్ట్రంలో మళ్లీ తెరుచుకోనున్నాయి. బంగాల్లో అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది దీదీ ప్రభుత్వం. అయితే పరిమిత సంఖ్యలోనే జనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 లేదా అంతకంటే తక్కువ మంది మాత్రమే హాజరుకావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
భౌతిక దూరం, మాస్కు ధరించడం సహా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీటికి అనుమతిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
మ్యూజికల్, డ్యాన్స్, మ్యాజిక్ షోలు వంటివాటిపై కూడా వచ్చే నెలలో నిషేధం తొలగించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
మార్చిలో కరోనా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లపై నిషేధం ఉంది. ఇప్పుడు తొలిసారి బంగాల్ ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు రెడీ అయింది.