సీఐసీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి అరథూన్ తెలిపారు. ఎస్ఎంఎస్ల ద్వారా కూడా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
ఈ ఏడాది వేసవిలో నిర్వహించాల్సిన 10, 12వ తరగతి పరీక్షలు కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడి రద్దయ్యాయి. గత పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించనున్నారు. మూడు పరీక్షల్లో సగటు ఆధారంగా ఫైనల్ మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు, ప్రాజెక్టు వర్కును కూడా పరిగణలోకి తీసుకుంటారు.