ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై ఆరోపణలు ఏంటి?

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసు ఐఎన్​ఎక్స్​. అసలు ఈ కేసు ఏంటి? ఈ ఐఎన్​ఎక్స్​ మీడియా కేసుకు చిదంబరానికి సంబంధం ఏంటి? ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు చూద్దాం.

author img

By

Published : Aug 21, 2019, 5:18 AM IST

Updated : Sep 27, 2019, 5:45 PM IST

ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై ఆరోపణలు ఏంటి?

ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన అవినీతి కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం దిల్లీ హైకోర్టులో ఆయన చేసిన అపీల్​ను న్యాయస్థానం కొట్టివేసింది. అసలు ఈ కేసుకు ఆయనకు సంబంధం ఏంటి? అసలు కేసు ఏంటి?

కేసు ఏంటి?

మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు రూ.305 కోట్లు విదేశీ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

కేసు పూర్వాపరాలు...

  • 2017 మే 15: మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్‌కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన 'ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ)' 2007లో ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది..
  • 2018: ఈ విషయంపై ఈడీ మనీ లాండరింగ్​ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
  • 2018 మే 30: సీబీఐ దర్యాప్తు చేస్తోన్న ఈ అవినీతి కేసులో ముందస్తు బెయిల్​ కోరుతూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
  • 2018 జులై 23: ఈడీ దర్యాప్తు చేస్తోన్న మనీ లాండరింగ్​ కేసులో ముందస్తు బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును కోరారు.​
  • 2018 జులై 25: ఈ రెండు కేసుల్లోనూ చిదంబరం అరెస్టు కాకుండా ఉండేందుకు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది.
  • 2019 జనవరి 25: రెండు కేసుల్లో చిదంబరం కోరిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్​ చేసింది దిల్లీ హైకోర్టు.​
  • 2019 ఆగస్టు 20: చిదంబరం వేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్లను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేవరకు మధ్యంతర రక్షణ కల్పించాలన్న వినతినీ తోసిపుచ్చింది.
  • ఇదీ చూడండి: ఐఎన్​ఎక్స్​ కేసు: ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్ట్!

Bhopal (MP), Aug 20 (ANI): Madhya Pradesh Energy Minister Priyavrat Singh faced an awkward moment at his press conference when a power outage happened. The media interaction had been organised to inform about the Congress government's achievements in the power sector in the last eight months after coming to power.
Last Updated : Sep 27, 2019, 5:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.