ETV Bharat / bharat

బెంగళూరులో గంజాయి చాక్లెట్ల కలకలం

కర్ణాటకలోని ఓ దుకాణంలో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో డ్రగ్స్​ విక్రయిస్తున్న దుకాణంలో సోదాలు నిర్వహించగా... చాక్లెట్ల రూపంలో ఉన్న 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు.

author img

By

Published : Oct 16, 2020, 12:13 PM IST

Updated : Oct 16, 2020, 6:35 PM IST

chocolate marijuana seized in Bengaluru
బెంగళూరులో గంజాయి చాక్లెట్ల కలకలం

కర్ణాటకలోని శాండిల్​వుడ్​ డ్రగ్స్ రాకెట్​ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 2.2కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. బెంగళూరులో గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలో కళాశాల విద్యార్థులు, యువతకు గంజాయిని చాక్లెట్​ రూపంలో విక్రయిస్తున్నాడు ఓ దుకాణాదారుడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. సుబ్రమణ్యనగర్​లోని బీడా దుకాణంపై దాడులు చేసి, 2.2కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే షాపు యజమాని పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి..

ఈ డ్రగ్స్​ చాక్లెట్లు ఉత్తర్​ప్రదేశ్​ నుంచి నగరంలోకిి దిగుమతి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అచ్చం పిల్లలు తినే చాక్లెట్లను పోలి ఉన్నాయని.. ఒక్కోదాన్ని రూ.50 చొప్పున అమ్ముతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ విషయంలో భారత్​ కన్నా పాకిస్థాన్​ భేష్​: రాహుల్​

Last Updated : Oct 16, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.