ETV Bharat / bharat

తండ్రికి గడ్డం పెరిగితే కుమారుడే దిక్కయ్యాడు

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు తప్ప అన్ని షాప్​లు బందయ్యాయి. ఈ నేపథ్యంలో క్షవరశాల(హేర్‌ సెలూన్‌)లూ మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం పురుషులు జుట్టు, గడ్డం పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రికి ఇదే సమస్య ఎదురైతే ఓ పరిష్కారంతో దాన్నుంచి బయటపడ్డారు.

Chirag Paswan shaves dad Ram Vilas Paswan's beard amid Coronavirus lockdown 2020
తండ్రికి గడ్డం పెరిగితే కుమారుడే దిక్కయ్యాడు!
author img

By

Published : Apr 12, 2020, 11:25 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కేంద్ర మంత్రి, బిహార్‌ నేత రాంవిలాస్‌ పాసవాన్ గడ్డం పెరిగిపోయింది. క్షవరశాల(హేర్‌ సెలూన్‌)లు మూతబడిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ సహాయం తీసుకున్నారు. ఫలితంగా చిరాగ్​ ట్రిమ్మర్‌తో గడ్డాన్ని ట్రిమ్‌ చేశారు. ఆదివారం ఈ వీడియోను ఆయన ట్విట్టర్​లో పంచుకున్నారు.

" నాకు ఈ నైపుణ్యం ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం" అని వీడియోకు వ్యాఖ్యను చేర్చారు చిరాగ్​. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల బాధలు చెప్పుకుంటూ సరదాగా ట్వీట్లు చేస్తున్నారు.

లాక్​డౌన్​ కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ ఇష్టమైన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు వంట పనులు, వ్యాయామాలు చేస్తూ వాటి వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుని అభిమానులకు మరింత చేరువవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.