గణతంత్ర వేడుకల్లో నిర్వహించే గగన విన్యాసాల్లో తొలిసారి అపాచీ, చినూక్ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టనున్నాయని వైమానిక అధికారులు వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఫ్రాన్స్ నుంచి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అందుకున్న తొలి రఫేల్ ఫైటర్ జెట్‌ను ప్రదర్శించనున్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రఫేల్‌తో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, వైమానిక హెలికాప్టర్, ఆకాశ్ క్షిపణి, ఆస్ట్రా క్షిపణులను భారత వాయుసేన ప్రదర్శించనుంది. గణతంత్ర వేడుకల్లో 144 మంది గల వాయుసేన బృందానికి లెఫ్టినెంట్ శ్రీకాంత్ శర్మ నాయకత్వం వహిస్తారు.
ఈ పరేడ్‌లో 41 విమానాలు, 23 హెలికాప్టర్లు, 16 యుద్ధ విమానాలు, 10 రవాణా విమానాలు పాల్గొంటాయని వైమానిక దళ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్'