ETV Bharat / bharat

'అక్కడ చైనా వచ్చింది.. ఇక్కడ మోదీ అదృశ్యమయ్యారు' - రాహుల్​ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి చైనా ప్రవేశించిందని.. కానీ సమాధానం చెప్పాల్సిన ప్రధాని అదృశ్యమయ్యారని ట్వీట్​ చేశారు.

Chinese have walked in and taken our territory, PM has vanished: Rahul
'అక్కడ చైనా వచ్చింది.. ఇక్కడ మోదీజీ అదృశ్యమయ్యారు'
author img

By

Published : Jun 10, 2020, 11:10 AM IST

చైనాతో సరిహద్దు వివాదంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ విషయంపై ఇటీవలే రక్షణమంత్రి రాజ్​నాథ్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్​.. తాజాగా ప్రధానమంత్రి మోదీపై తన బాణాలను ఎక్కుపెట్టారు. లద్దాక్​​లోని భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. దీనిపై సమాధానమివ్వాల్సిన మోదీ అదృశ్యమయ్యారని ఎద్దేవా చేస్తూ ట్వీట్​ చేశారు.

  • The Chinese have walked in and taken our territory in Ladakh.

    Meanwhile

    The PM is absolutely silent and has vanished from the scene.https://t.co/Cv06T6aMvU

    — Rahul Gandhi (@RahulGandhi) June 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లద్దాక్​​లోని మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై ప్రధాని నిశ్శబ్దంగా ఉన్నారు. మోదీ అదృశ్యమయ్యారు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

తన వ్యాఖ్యలకు బలం చేకూరేలా.. ఓ వార్తా కథనాన్ని ట్వీట్​కు జత చేశారు రాహుల్​.

మే 5న పాంగ్యాంగ్​ ట్సో ప్రాంతంలో భారత్​-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.