రాజీనామా లేఖలపై కుమారస్వామి స్పష్టతనిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చూపేందుకే ఆ పత్రాలను సభకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి గవర్నర్కు లేఖ పంపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు ప్రచారాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు.
కుమారస్వామి రాజీనామా లేఖపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆ లేఖ నకిలీదిగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: బలపరీక్షకు స్పీకర్ డెడ్లైన్- నేడు ఓటింగ్!