భారత్‌లో రెండు రోజుల పర్యటనకు రానున్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. ఈ సందర్భంగా తమిళనాడు మహాబలిపురంలోని పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు ఇరువురునేతలు.
శుక్రవారం మధ్యాహ్నం చెన్నై చేరుకుని.. తిరిగి శనివారం మధ్యాహ్నం చైనాకు బయలుదేరనున్న జిన్‌పింగ్ పూర్తి పర్యటన ఇలా సాగనుంది.
అక్టోబర్ 11 (శుక్రవారం)
మధ్యాహ్నం
- 1:20 : ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.
- 1:45 : గిండీ ప్రాంతంలోని ఐటీసీ ఛోళా హోటల్‌కు చేరుకోనున్న జిన్‌పింగ్. అక్కడే కాసేపు సేదతీరి.. మహాబలిపురానికి పయనం.
సాయంత్రం
మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం
- 5:00 : 'అర్జున పెనెన్స్' సందర్శన
- 5:20 : పంచరథాల స్మారక సముదాయం సందర్శన
- 5:45 : షోర్ దేవాలయానికి ఇరువురు నేతలు
- అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించనున్న మోదీ-జిన్‌పింగ్, మహాబలిపురంలోనే రాత్రి భోజనం.
రాత్రి
- 9:00 : చెన్నై ఐటీసీ ఛోళా హోటల్‌కు జిన్‌పింగ్ తిరుగుపయనం
అక్టోబర్ 12 (శనివారం)
ఉదయం 9 గంటలకు జిన్‌పింగ్ మహాబలిపురానికి పయనమవుతారు. అనంతరం ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు అనధికారిక భేటీలో పాల్గొంటారు.
మధ్యాహ్నం
- 1:00 : జిన్‌పింగ్ చెన్నైకు తిరుగుపయనం
- 2:20 : చైనాకు బయలుదేరనున్న జిన్‌పింగ్
(పరిస్థితులను బట్టి ఈ సమయాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది)
ఇదీ చూడండి: మహాబలిపురం: మోదీ-జిన్‌పింగ్ భేటీ ముఖ్య ఉద్దేశమిదేనా?