ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. ఉత్తర్ప్రదేశ్ మీర్జాపుర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇవేవీ ఇవ్వకుండా రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా ఇదే భోజనం అందిస్తున్నారు.
ఇలా వెలుగులోకి...
ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా ఈ స్కూల్లో పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
ఈ వ్యవహారం బయటకు రావటం వల్ల అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్, స్కూల్ ఇన్‌ఛార్జ్ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు తేలింది. వారిని విధుల నుంచి సస్పెండ్ చేశామని అధికారులు వెల్లడించారు. ఉప్పుతో రొట్టెలు తింటున్న చిన్నారుల వీడియోను రాష్ట్రీయ జనతా దళ్ ట్విటర్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
-
उ०प्र० के मिर्ज़ापुर में मिड डे मील में नमक रोटी!
— Rashtriya Janata Dal (@RJDforIndia) August 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
"$5 ट्रिलियन अर्थव्यवस्था" की अजीमोशान कामयाबी!
ऐ संसद में जय श्री राम चिल्लाने वालों! तुम्हारे राम राज्य में शम्बूक से न्याय हो रहा है!
दुनिया की सबसे ऊंची मूर्ति, सबसे बड़ा मंदिर बनाओ! सचमुच देश बदल दिए हो! pic.twitter.com/iFm4rkec4X
">उ०प्र० के मिर्ज़ापुर में मिड डे मील में नमक रोटी!
— Rashtriya Janata Dal (@RJDforIndia) August 22, 2019
"$5 ट्रिलियन अर्थव्यवस्था" की अजीमोशान कामयाबी!
ऐ संसद में जय श्री राम चिल्लाने वालों! तुम्हारे राम राज्य में शम्बूक से न्याय हो रहा है!
दुनिया की सबसे ऊंची मूर्ति, सबसे बड़ा मंदिर बनाओ! सचमुच देश बदल दिए हो! pic.twitter.com/iFm4rkec4Xउ०प्र० के मिर्ज़ापुर में मिड डे मील में नमक रोटी!
— Rashtriya Janata Dal (@RJDforIndia) August 22, 2019
"$5 ट्रिलियन अर्थव्यवस्था" की अजीमोशान कामयाबी!
ऐ संसद में जय श्री राम चिल्लाने वालों! तुम्हारे राम राज्य में शम्बूक से न्याय हो रहा है!
दुनिया की सबसे ऊंची मूर्ति, सबसे बड़ा मंदिर बनाओ! सचमुच देश बदल दिए हो! pic.twitter.com/iFm4rkec4X
బెంగాల్లోనూ..
ఇటీవల పశ్చిమ బంగలోని చిన్సురాలోని ఓ బాలికల పాఠశాలలోనూ చిన్నారులకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు అధికారులు.
ఇదీ చూడండి: 2వేల మంది రాజ్పుత్ వనితల 'తల్వార్ రాస్'