ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేయకుండాసుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
సీబీఐ, ఈడీ తనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షించాలని చిదంబరం కొద్దిరోజుల క్రితం దాఖలు చేసిన వ్యాజ్యాలు నేడు సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. సీబీఐ ఇప్పటికే చిదంబరాన్ని అరెస్టు చేసినందుకు... ఈడీకి సంబంధించిన పిటిషన్పై మాత్రమే వాదనలు జరిగాయి. చివరకు కేంద్ర మాజీ మంత్రి అభ్యర్థన పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.
ఈడీ కేసులో స్వల్ప ఊరట వచ్చినా చిదంబరం ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.