ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ బలగాలే లక్ష్యంగా పేలిన మందుపాతర

author img

By

Published : Nov 29, 2020, 5:43 AM IST

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో సీఆర్​పీఎఫ్​ బలగాలే లక్ష్యంగా మందుపాతర (ఐఈడీ) పేల్చారు నక్సలైట్లు. ఈ ఘటనలో ఐదుగురు కోబ్రా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

RPF commandos injured in IED blast
పేలిన మందుపాతర

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో నక్సలైట్లు రెచ్చిపోయారు. సీఆర్​పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రీసోల్యూట్​ యాక్షన్​) బలగాలపై మందుపాతర (ఐఈడీ) దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

" నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్​లో భాగంగా తాడ్​మెట్ల గ్రామంలో తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఐఈడీ దాడి జరిగింది. కోబ్రా 206 బెటాలియన్​కు చెందిన ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిని అడవి నుంచి తరలించాం."

-పీ సుందర్​రాజ్, బస్తర్​ రేంజ్​ ఐజీ

గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఆర్​పీఎఫ్​ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో కల్లోలం సృష్టించేందుకే చొరబాట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.