ETV Bharat / bharat

హైదరాబాద్​కు 200 టన్నుల అమోనియం నైట్రేట్​! - Ammonium Nitrate hyderabad

చెన్నై ఓడరేవులోని 700 టన్నుల అమోనియం నైట్రేట్​ను హైదరాబాద్​కు తరలిస్తున్నారు. మొదటి బ్యాచ్​లో భాగంగా 200కుపైగా టన్నుల పేలుడు పదార్థాల లోడు​.. ఆదివారమే హైదరాబాద్​కు బయలుదేరింది.​

Chennais Ammonium Nitrate stock getting cleared in phased manner
చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్​ హైదరాబాద్​కు తరలింపు
author img

By

Published : Aug 10, 2020, 4:19 PM IST

లెబనాన్ బీరుట్​​ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై ఓడరేవులో దాదాపు 700 టన్నుల అమోనియం నైట్రేట్​ నిల్వ ఉన్నట్టు తేలడం సర్వత్రా భయాందోళనకు కారణమైంది. తాజాగా.. ఆ అమోనియన్​ నైట్రేట్​ను దశలవారీగా అక్కడి నుంచి తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు మూడొంతుల నిల్వను హైదరాబాద్​కు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కంటైనర్​ ఆదివారమే బయలుదేరిందని చెన్నై పోలీస్​ కమీషనర్​ మహేష్​ కుమార్​ వెల్లడించారు.

మొదటి బ్యాచ్​లో భాగంగా.. 200 టన్నులకుపైగా అమోనియమ్​ నైట్రేట్​ను 10 కంటైనర్లలో తరలించారు. మిగిలిన 27 కంటైనర్లను రానున్న రెండు రోజుల్లో చెన్నై నుంచి తరలించనున్నట్టు మహేష్​ కుమార్​ తెలిపారు.

అయితే ఈ విషయంలో ప్రజలు భయపడకూడదని పోలీస్​ కమీషనర్​ సూచించారు. కస్టమ్స్​ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతోనే దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు మహేష్​ కుమార్​.

శ్రీ అమ్మన్​ కెమికల్స్​ అనే సంస్థ.. 2015లో దక్షిణ కొరియా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవడం వల్ల 700 టన్నుల అమోనియం నైట్రేట్​ను సీజ్​ చేశారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లు. బీరుట్​ ఘటనతో ఈ విషయం మళ్లీ బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ మొత్తం నిల్వపై వేలం నిర్వహించారు కస్టమ్స్​ అధికరులు. హైదరాబాద్​కు చెందిన సాల్వో ఎక్స్​ప్లోజివ్స్​ అండ్​ కెమికల్స్​ దీనిని సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.