ETV Bharat / bharat

'నమో'స్తే ట్రంప్​: ఆరు కౌగిలింతలు- లెక్కలేనన్ని ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహబంధం సాధారణమేమీ కాదు. ఇరువురు మంచి మిత్రులమని ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నారు ఈ దేశాధినేతలు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరోసారి స్పష్టంగా కనిపించింది. అహ్మదాబాద్​ పర్యటనలో భాగంగా ఇరువురు మొత్తం ఆరుసార్లు ఆలింగనం చేసుకున్నారు.

hugs
ట్రంప్​
author img

By

Published : Feb 24, 2020, 7:14 PM IST

Updated : Mar 2, 2020, 10:43 AM IST

'నమో'స్తే ట్రంప్​: ఆరు కౌగిలింతలు- లెక్కలేనన్ని ప్రశంసలు

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,​ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య పెనవేసుకున్న బంధం సాధారణమైనది కాదనేది తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య అమితమైన గౌరవమర్యాదలే కాకుండా సుధృడ స్నేహ బంధం అల్లుకొని ఉంది. తామిద్దరం మంచి స్నేహితులమని ఇరుదేశాధినేతలు ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయతా అభిమానాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయన్న విషయం తాజా ట్రంప్ పర్యటనలో మరోసారి రుజువైంది.

ఆత్మీయ ఆలింగనాలు..

భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్న అధ్యక్షుడికి ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అహ్మదాబాద్​ పర్యటనలో మోదీ, ట్రంప్​ ఇద్దరు మొత్తం ఆరు సార్లు ఆలింగనం చేసుకున్నారు. ఎయిర్​ఫోర్స్​ వన్ విమానం నుంచి దిగిన అధ్యక్షుడిని మొదట ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోదీ. ఈ సమయంలో ఇరువురు బేర్ హగ్​ ఇచ్చుకున్నారు.

బేర్ హగ్​ అంటే ఎదుటి వ్యక్తిని సంరక్షిస్తున్నట్లు రెండు చేతులను ఆ వ్యక్తిపై వేసి ఆలింగనం చేసుకోవడం.

విమానాశ్రయంలో ట్రంప్​కు మోదీ స్వాగతం పలికిన తర్వాత ఇద్దరు కలిసి రోడ్​ షోలో పాల్గొన్నారు. సబర్మతి సందర్శన అనంతరం మోటేరా స్టేడియానికి పయనమయ్యారు.

మోటేరా స్టేడియంలో ప్రవేశించిన తర్వాత రెండు సార్లు కౌగిలించుకున్నారు మోదీ, ట్రంప్. స్టేడియంలో ప్రజలనుద్దేశించి అధినేతలిద్దరు ప్రసంగించారు. తమ ప్రసంగాలు ముగించిన తర్వాత ఇద్దరు మరో మూడు సార్లు ఆలింగనం చేసుకున్నారు.

ఇక ఇరువురు చేసుకున్న కరచాలనాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా!

ప్రశంసల వర్షం!

అహ్మదాబాద్ పర్యటనలో అత్యున్నత దేశాధినేతలిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఛాయ్​వాలా నుంచి అత్యున్నత స్థాయికి మోదీ ఎదిగారని ట్రంప్ కీర్తించారు. మోదీ అత్యంత విజయవంతమైన నేత అని కితాబిచ్చారు. దేశ అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషిచేస్తున్నారని ప్రశంసించారు.

"మోదీ తన తండ్రితో కలిసి ఛాయ్​వాలాగా టీ అమ్ముతూ జీవితం ప్రారంభించారు. అందరూ ఆయన్ను ప్రేమిస్తారు. కానీ ఆయన చాలా దృఢమైన వ్యక్తి. ప్రధానమంత్రి చాలా విజయవంతమైన నేత. గత సంవత్సరం 600 మిలియన్ల ప్రజలు పాల్గొని ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికల్లో మోదీకి ఘన విజయం కట్టబెట్టారు. ప్రధాని మోదీ.. మీరు గుజరాత్​కు మాత్రమే ఆదర్శం కాదు. కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధిస్తారనడానికి మీరు నిదర్శనం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్​ ప్రేమకు కృతజ్ఞతలు

ప్రధాని మోదీ సైతం అధ్యక్షుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్​ పట్ల ట్రంప్ చూపించిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానందల పేర్లను ట్రంప్ ప్రస్తావించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ బంధం చిరకాలం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Mar 2, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.