ETV Bharat / bharat

వంటచేసే వ్యక్తితో మూత్రం తాగించిన యజమాని

బెంగళూరు నేలమంగళలో అమానవీయ ఘటన జరిగింది. చేసిన పనికి జీతం అడిగితే వికృత చర్యలకు పాల్పడ్డాడు ఓ యజమాని. వంట చేసి వ్యక్తిని సిగరెట్​తో కాల్చి, మూత్రం తాగేలా చేశాడు.

Chef was made to drink urine, was burnt in cigar for asking salary
అన్నచేసే వంటవాడి చేతే మూత్రం తాగించాడు
author img

By

Published : Nov 8, 2020, 1:57 PM IST

బెంగళూరు నేలమంగళకు చెందిన హాస్టల్​ యజమాని జీజీ యుహాన్​.. తన వద్ద వంట చేసే సాజీతో అమానవీయంగా ప్రవర్తించాడు. చేసిన పనికి జీతం అడిగినందుకు సిగరెట్​తో కాల్చి వాతలు పెట్టాడు. మూత్రం తాగేలా చేసి వికృతంగా ప్రవర్తించాడు.

ఇదీ జరిగింది..

జీజీ యుహాన్​కు బెంగళూరులోని తోటగుడ్డహల్లిలో హోటల్​తో పాటు హాస్టల్​ ఉంది. ఇందులో వంట చేయడానికి రెండేళ్ల క్రితం సాజీని నియమించుకున్నాడు. రూ.3 వేల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదట్లో ఇద్దరికీ మంచి సంబంధాలు ఉండేవి. కానీ కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇరువురి మధ్య విబేధాలు తెలత్తాయి. లాక్​డౌన్​లో హాస్టల్ నడవనందున ఆ మూడు నెలలకు జీతం ఇవ్వనని యుహాన్​ అన్నాడు. లాక్​డౌన్ మినహా మిగిలిన 9 నెలల జీతం ఇవ్వాలని జీజీ పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.

అయితే యుహాన్​ భార్య గురించి జీజీ తప్పుగా మాట్లాడాడని, దీంతో కోపోద్రిక్తుడైన యుహాన్.. స్నేహితులతో కలిసి జీజీపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయాలపాలైన సాజీ ప్రస్తుతం స్థానిక సప్తగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యుహాన్​ భార్యకు జీజీ అసభ్య సందేశాలు పంపడం కూడా వివాదానికి కారణమని తెలుస్తోంది.

ఘర్షణ అనంతరం ఇద్దరూ ఒకరిపైఒకరు కేసులు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.