గుజరాత్, సూరత్‌కు చెందిన బిన్నీ జైన్.. కరోనా కిట్ రాఖీలు రూపొందించాడు. కరోనా కాలంలో అత్యవసరమైన మాస్క్, జేబులో పెట్టుకునేందుకు వీలుగా ఉండే చిన్న శానిటైజర్ బాటిల్ జోడించి రాఖీలు సృష్టించాడు.
కరోనా కాలంలో రక్షా బంధన్ పండుగను మరింత సురక్షితంగా మార్చేందుకే ఈ ఆలోచన చేశానంటున్నాడు బిన్నీ. ఒక్కో రాఖీ ధర రూ. 30గా ఖరారు చేశాడు. మహిళలు.. సాధారణ వాటి కంటే ఈ వినూత్నంగా కనిపిస్తున్న మాస్క్, శానిటైజర్ రాఖీలనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించటం నిషేధం!