చంద్రయాన్-2 ప్రయోగంలో భాగమైన ఆర్బిటర్ భద్రంగానే ఉన్నట్లు వెల్లడించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ల్యాండర్, రోవర్ భవితవ్యంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.
"ఆర్బిటర్ క్షేమంగా ఉంది. సరిగానే పనిచేస్తుంది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతోంది."
-ఇస్రో ప్రకటన
2,379 కిలోలు బరువుండే ఆర్బిటర్ జీవిత కాలం ఒక సంవత్సరం. చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ సెన్సింగ్ ద్వారా పరిశోధనలు చేస్తుంది. ఆర్బిటర్ 8 శాస్త్రీయ పేలోడ్లను కలిగి ఉంటుంది. చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఇవి ఉపయోగపతాయి.
సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రుడి దిశగా పయనం సాగించింది విక్రమ్ ల్యాండర్. జాబిల్లికి 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఇస్రోకు సంకేతాలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగం