కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ విలేకరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై ఈటీవి భారత్కు ముఖాముఖి ఇచ్చారు అయ్యర్.
ఈ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల ప్రచారంలో.. నరేంద్ర మోదీపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విలేకరు గుర్తు చేయగా అయ్యర్ ఆగ్రహంతో ఊగిపోయారు. కశ్మీర్ అంశంపై ప్రశ్నించాలని... గతంపై కాదన్నారు.
నాటి ఎన్నికల ప్రచారంలో తల్కతోరా స్టేడియం వేదికగా తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. 'ఆయన (మోదీ) ఓటమి ఖాయమని, టీ అమ్మాలనుకుంటే తాము సహాయపడతామనే' తాను వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
తాము ఏమీ అడగాలో మీరు ఎలా చెప్తారని విలేకరు అడగగా... వింతగా ప్రవర్తిస్తూ ముఖాముఖి నుంచి తప్పించుకునేందుకు యత్నించారు అయ్యర్.
ఇదీ చూడండి: 'మహోన్నత వ్యక్తిత్వం సుష్మాస్వరాజ్ సొంతం'