ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు స్థానికులకు గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా గంగూరు పోలీస్స్టేషన్ పరిధిలోని రాజుపేట వద్ద ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనం వెళ్తుండంగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.



వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొన్న భద్రతా సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సల్స్ ఈ దాడికి కుట్ర పన్నగా పొరపాటున పౌరుల వాహనం వచ్చినప్పుడు పేలుడు జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.