జమ్ముకశ్మీర్‌పై నిర్ణయం జాతీయ శ్రేయస్సు దృష్ట్యా అత్యవసరమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ధైర్యవంతమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ ఖాతాలో మోహన్ భగవత్, ఉపాధ్యక్షుడు సురేశ్ జోషి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
"ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జమ్ముకశ్మీర్ సహా ఇది దేశానికి చాలా అవసరం."
-ట్విట్టర్లో ఆర్ఎస్ఎస్ బాధ్యులు
'370 రద్దు భారత స్వతంత్రతకు చిహ్నం'
ఆర్టికల్ 370 రద్దు భారత స్వతంత్రతకు నిదర్శనమన్నారు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, శివసేన దివంగత అధ్యక్షుడు బాల్ ఠాక్రే స్వప్నాన్ని సాకారం చేసిందన్నారు. రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాలను పక్కనపెట్టి భారత సార్వభౌమాత్వాన్ని కాపాడాలని ఉద్ఘాటించారు ఉద్ధవ్.
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: భగ్గుమన్న రాజ్యసభ