సమీప భవిష్యత్‌లో కరోనా టీకా రానున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తులు ప్రారంభించింది కేంద్రం. కరోనా టీకా పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించడానికి బ్లాక్ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాలను కోరింది. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉత్పన్నమవుతున్న అపోహలను తొలగించేందుకు మత పెద్దలు, స్థానిక నాయకుల సాయాన్ని తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
టీకా పంపిణీ సమయంలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించేందుకు బ్లాక్ టాస్క్ ఫోర్స్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వ విభాగాలు, ఎన్జీఓలు, మతపెద్దలు సభ్యులుగా ఉండే ఈ బ్లాక్ స్థాయి టాస్క్ ఫోర్స్‌కు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. ఏడాదిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో జిల్లా, బ్లాక్ స్థాయిలో టీకా పంపిణీకి కావాల్సిన సంస్థాగత ఏర్పాట్లను కేంద్రం పరిశీలిస్తోంది.
ఇదీ చూడండి: ''అందరికీ న్యాయం'లో అతిపెద్ద అడ్డంకి అదే'