'నిర్భయ ఫండ్' ద్వారా వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.9288.45 కోట్లు వెచ్చించినట్లు కేంద్రం అంచనా వేసింది. దేశంలోని మహిళల సంరక్షణ కోసం 2014లో నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది కేంద్రం.

వివిధ ప్రాజెక్టులకు రూ.5,712.85 కోట్లు కేటాయించగా, సంబంధిత మంత్రిత్వ శాఖలు రూ.3,544.06 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించిన నిధి కేటాయింపులపై ఎంపవర్డ్ కమిటీ(ఈసీ) అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈసీ అనుమతి పొందాకే... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఫండ్‌ను విడుదల చేస్తాయని పేర్కొంది.