ETV Bharat / bharat

ఏజీఆర్​ చెల్లింపుల ఫార్ములాకు అనుమతి ఇవ్వండి: కేంద్రం

టెలికాం సంస్థలకు ఊరట కలిగించే విధంగా ఏజీఆర్​ చెల్లింపుల ఫార్ములాకు అనుమతించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం. బకాయిలను 20 ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

AGR dues
ఏజీఆర్​ చెల్లింపుల ఫార్ములాకు అనుమతి ఇవ్వండి: కేంద్రం
author img

By

Published : Mar 16, 2020, 10:58 PM IST

టెలికాం సంస్థలు బకాయి ఉన్న ఏజీఆర్​ చెల్లింపుల ఫార్ములాకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్థికవ్యవస్థపై ప్రభావం లేకుండా ఉండేందుకు టెలికాం సంస్థలు ఏజీఆర్​ బకాయిలను 20ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

గతంలో ఏజీఆర్​ బకాయిల చెల్లింపులపై తీర్పు ఇచ్చిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ లిస్ట్‌ చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎమ్​ఆర్​ షాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు కేంద్రానికి చెల్లించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2019, అక్టోబర్ 24న తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా.. కేంద్రం పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని, లేకుంటే బకాయిల కారణంగా టెలికాం కంపెనీలు దివాలా తీసే ప్రమాదం ఉందన్నారు. టెలికాం రంగంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

మరోవైపు.. ఏజీఆర్​ చెల్లింపులకు సంబంధించి తమ తీర్పును అమలు చేయనందుకు ఫిబ్రవరి 14న ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసులపై ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి: 'సుప్రీం' మాజీ సీజేఐ రంజన్​ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.